చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

GNTR: వట్టిచెరుకూరు మండలంలోని అనంతవరప్పాడులోని చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శనివారం వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి దిగి అతను మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం గాలింపు చర్యల అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.