నేపాల్‌లో పామూరుకు చెందిన 8 మంది యువకులు అరెస్ట్

నేపాల్‌లో పామూరుకు చెందిన 8 మంది యువకులు  అరెస్ట్

ప్రకాశం: ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం నేపాల్‌కు వెళ్లిన పామూరుకు చెందిన 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి విమానంలో నేపాల్ చేరుకున్న యువకులు, పాస్‌పోర్ట్ అవసరం లేకపోవడంతో ఆధార్ కార్డుతో ప్రయాణించారు. నేపాల్‌లో జరుగుతున్న ఎన్పీఎల్ క్రికెట్‌పై బెట్టింగ్‌లు కాసేందుకు వీరు అక్కడికి వెళ్లినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఈ అరెస్టులు జరిగినట్లు తెలిపారు.