మధురవాడలో జర్నలిస్టుల వనసమారాధన
VSP: మధురవాడ జాతర శిల్ప కళా వేదికలో వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల వనసమారాధన ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి ఏసీపీ అప్పలరాజు పాల్గొని పాత్రికేయుల సేవలను కొనియాడారు. కుటుంబాలతో పెద్ద ఎత్తున హాజరైన జర్నలిస్టులకు వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మిమిక్రీ, కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.