కర్రతో దాడి చేసిన వ్యక్తికి రోజంతా నిలబడే శిక్ష

కర్రతో దాడి చేసిన వ్యక్తికి రోజంతా నిలబడే శిక్ష

ప్రకాశం: రాచర్లలో చిరంజీవి అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి 2018లో కర్రతో దాడి చేశాడు. పూర్తి సాక్షాదారాలతో మంగళవారం పోలీసులు నిందితుడిని గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి భరత్ చంద్ర, వెంకటయ్య నేరం చేశాడని ధృవీకరించారు. దీంతో వెంకటయ్యకు రోజంతా కోర్టులో నిలబడాలని శిక్షతోపాటు రూ.5000 జరిమానా విధించారు.