చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేశారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో సాటి మనిషి దాహార్తిని తీర్చడం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.