VIDEO: చెత్తాచెదారం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు

NZB: కోటగిరి మండల కేంద్రంలో చెత్త సమస్య స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న శిథిలావస్థలోని బస్టాండ్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడ చెత్త, ఇతర వ్యర్థాలు పారబోస్తున్నారు. ఎండకు ఎండి, వానకు తడిసి దుర్గంధం వెదజల్లుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చెత్తను ఎక్కడపడితే అక్కడ పారబోయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.