కల్హేర్ మండల నూతన ఎస్సైగా రవి గౌడ్

కల్హేర్ మండల నూతన ఎస్సైగా రవి గౌడ్

SRD: కల్హేర్ మండల నూతన ఎస్సైగా రవి గౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సదాశివపేట్ ఎస్సైగా పనిచేసిన ఈయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ మేరకు సిబ్బంది స్వాగతించారు. ఇక్కడ ఎస్సైగా ఉన్న మధుసూదన్ రెడ్డి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని నూతన ఎస్సై రవిగౌడ్ తెలిపారు.