కర్నూలులో జంప్ రోప్ పోటీలు ప్రారంభం

కర్నూలు జిల్లాస్థాయి జంప్ రోప్ ఎంపిక పోటీలు గురువారం అవుట్‌డోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా జిల్లా ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి అవినాశ్ శెట్టి, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న పాల్గొన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని వారు సూచించారు. ఇందులో కార్యదర్శి జోసఫ్, తదితరులు పాల్గొన్నారు.