తాండూరులో దారుణ హత్య

తాండూరులో దారుణ హత్య

వికారాబాద్: తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో హత్య కలకలం రేపింది. రెడ్డిపల్లి వెంకటేశ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై గ్రామస్తులు అతడి భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.