VIDEO: నిన్నటి వరకూ రద్దీ.. నేడు ఖాళీ
VSP: సంక్రాంతి పండుగ సందర్భంగా పది రోజుల నుంచి రద్దీగా మారిన రోడ్లు నేడు ఖాళీగా మారాయి. పండగకు షాపింగ్ నిమిత్తం అధిక సంఖ్యలో ప్రజలు రావటంతో జగదాంబా, పూర్ణామార్కెట్, గాజువాక మొదలగు ప్రాంతాల్లో రోడ్లన్నీ జనసంద్రంతో నిండిపోయి నేడు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. విశాఖ ద్వారకానగర్ ప్రాంతాల్లో అడపా దడపా మాత్రమే వాహనాలు కనిపిస్తున్నాయి.