వ్యాస మహర్షి పురస్కారానికి ఎంపికైన మాస్టార్

వ్యాస మహర్షి పురస్కారానికి ఎంపికైన మాస్టార్

VZM: జాతీయ హిందూ ఉపాధ్యాయ సమితి (గుంటూరు) ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న వ్యాస మహర్షి పురస్కారానికి గజపతినగరం మండలం మర్రివలస ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కనకల చంద్రరావును ఎంపిక చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. నైతిక ఆధ్యాత్మిక విలువలతో పాటు సామాజిక అంశాలతో విద్యాబోధన చేస్తున్నందుకు పురస్కారం లభించింది. జూలై 13వ తేదీన బాపట్లలో అందిస్తారన్నారు.