నాగార్జునసాగర్ జలాశయానికి తగ్గిన వరద

AP: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2,23,176 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,90,482 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 585.6 అడుగులకు చేరింది. అధికారులు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నిల్వ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 299.16 టీఎంసీల నీటి నిల్వ ఉంది.