నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

CTR: పలమనేరు సబ్‌స్టేషన్, వి.కోట సబ్‌స్టేషన్ పరిధిలో కొత్తగా 220 KVA టవర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని పలమనేరు DEE జీవన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం 7.30గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. పలమనేరు అర్బన్, రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లి,వీకోట మండలాల్లో విద్యుత్ నిలిపివేస్తామని పేర్కొన్నారు.