ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పన
PPM: సాలూరు మండలం కొత్తవలస బాలికల ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పన కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం శంకుస్థాపన చేపట్టారు. సుమారు రూ.5.50 కోట్లుతో ఆశ్రమ పాఠశాలలో డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, ఇతర పనులు చేపడుతున్నామని పేర్కున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో జీ. పార్వతి పాల్గొన్నారు.