పూర కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు
KMM: సత్తుపల్లి పుర కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగినట్లు అందిన ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం ACB DSP రమేష్ ఆధ్వర్యంలోని బృందం కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది.