జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యాడ్ ఛైర్మన్‌గా సీతమ్మ

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యాడ్ ఛైర్మన్‌గా సీతమ్మ

NTR: జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా విలియంపేటకు చెందిన మల్లెల సీతమ్మను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే తాతయ్యను ఆమె కుటుంబ సభ్యులు, వార్డు సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సీతమ్మను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.