డుంబ్రిగూడలో స్వచ్ఛ రథం ప్రారంభం
అల్లూరి: డుంబ్రిగూడ మండల పరిధిలో స్వచ్ఛత కార్యక్రమాలను విస్తరించేందుకు స్వచ్ఛ రథాన్ని శనివారం ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో విశ్వనాధ్ పాల్గొని జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.