VIDEO: నెల్లూరులో గంజాయి పట్టివేత

VIDEO: నెల్లూరులో గంజాయి పట్టివేత

NLR: రైల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 12.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ మురళీధర్ తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో వ్యక్తి అనుమానస్పదంగా రెండు బ్యాగులతో తిరగడాన్ని గుర్తించారు. తమిళనాడుకు చెందిన పాత నేరస్థుడు విశ్వనాథ్‌గా గుర్తించారు.