కలెక్టర్‌కు ఎమ్మెల్యే ప్రశంసలు

NLR: పనిచేసే కలెక్టర్ జిల్లాలో ఉండడం సంతోషమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పొట్టేపాళెంలో రూ.1.40 కోట్లతో అభివృద్ధి పనులకు కలెక్టర్ ఆనంద్‌తో కలిసి ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. పొట్టేపాలెం అభివృద్ధికి నిధుల లభ్యతను బట్టి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాజకీయంగా తనకు పొట్టేపాలెం అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు.