నేడు ఒడిశా గవర్నర్ హరిబాబు రాక
VSP: ఒడిశా గవర్నర్ హరిబాబు ఇవాళ విశాఖ రానున్నారు. ఉదయం భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి నేరుగా దసపల్లా హిల్స్‌లో ఉన్న నివాసానికి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకు ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 27 వరకు విశాఖలోనే ఉండి, ఏయూ శతాబ్ది వేడుకలకు హాజరవుతారు. అనంతరం భువనేశ్వర్‌కు పయనమవుతారు.