దుబ్బతండా సర్పంచ్‌గా లునావత్ గెలుపు

దుబ్బతండా సర్పంచ్‌గా లునావత్ గెలుపు

NZB: మోస్రా మండలం దుబ్బ తండా గ్రామ పంచాయతీ సర్పంచిగా లునావత్ శివ 114 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 254 ఓట్లు పోలయ్యాయి. 184 ఓట్లు గెలుపొందిన అభ్యర్థి లునావత్ శివకుమార్‌కు రాగా, ప్రత్యర్థి వీరన్నకు 70 ఓట్లు పోలయ్యాయి. భారీ విజయంతో సర్పంచ్ పీఠం లునావత్ శివ కైవసం చేసుకోవడంతో గ్రామంలో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.