నేడు తవణంపల్లెలో ప్రజాదర్బార్
CTR: తవణంపల్లె మండలంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఎగువ మోదలపల్లి పంచాయతీ గోపాల మిత్ర సెంటర్‌లో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ప్రజాదర్బార్‌కు హాజరవుతారు. ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకస్తారు.