శంబర పోలమాంబ జాతర తేదీలు ఖరారు
PPM: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 22న పెద్దపోలమాంబ అమ్మవారికి సనప చాటింపు నిర్వహించి, 29న గ్రామంలోకి ఆహ్వానిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5, 6, 7వ తేదీల్లో పెద్దపోలమాంబ అమ్మవారి తొలేళ్లు, ప్రధానోత్సవం, అనుపోత్సవం నిర్వహిస్తారు. అదేరోజు శంబర పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించేందుకు చాటింపు వేస్తారు.