వేణు 'ఎల్లమ్మ'పై దిల్ రాజు అప్‌డేట్
దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు యెల్దండి 'ఎల్లమ్మ' ప్రాజెక్టును చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై దిల్ రాజు అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమా హీరో ఫిక్స్ అయ్యాడని, త్వరలోనే వెల్లడిస్తామని చెప్పాడు. హీరోయిన్ ఎవరనేది కూడా డిసెంబర్‌లో ప్రకటిస్తామని తెలిపాడు. 2026లో SVC నుంచి మొత్తం 6 ప్రాజెక్టులు వస్తాయని, వాటికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తామని అన్నాడు.