VIDEO: కోటప్పకొండలో శాస్త్రోక్తంగా సంప్రోక్షణ కార్యక్రమం
PLD: కోటప్పకొండ దేవస్థానంలో గ్రహణానంతరం సంప్రోక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. వేదమంత్రాల మధ్య శుద్ధి క్రతువులు చేపట్టారు. పవిత్ర జలాలతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. శాంతి, సుభిక్షం కలగాలని అర్చకులు పూజలు గావించారు. అనంతరం ప్రత్యేక శాంతి పూజలు చేపట్టారు. ఆలయ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు.