ఎన్నికలు.. ఓటర్ల కోసం ఈసీ వినూత్న ప్రచారం
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఈసీ సరికొత్త పంథాను ఎంచుకుంది. ఇందుకోసం ఓటర్ల చైతన్యం తెచ్చేలా ఓ పాటను వీడియో రూపంలో ఆవిష్కరించింది. ఈ వీడియోలో కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్, కేల్కర్ జిల్లా కలెక్టర్ అను కుమారితో పాటు పలువురు జెన్ జీ యువత పాటకు తగ్గట్లుగా స్టెప్పులేసి అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.