ముడుమాలలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
KRNL: సి. బెళగల్ మండల పరిధిలోని ముడుమాల గ్రామశివారులో ఆదివారం తుంగభద్ర నదీ తీరంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు SI వేణుగోపాల్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా ఫోరెన్సిక్ బృంధంతో కలిసి పోస్టుమార్టం నిర్వహించి ఇన్హ్యూమేషన్ చేశారు. మృతుడి ఎత్తు 172 సెంటీమీటర్లు, ఎడమ భుజంపై SU అక్షరాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.