'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'
సూర్యపేట పట్టణంలోని మానస నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివిధ కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని అన్నారు.