విద్యార్థులకు భోజన ప్లేట్లు బహుకరణ
ప్రకాశం: కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు లక్ష్మి శ్రీనివాసులు తండ్రి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం 40 మంది విద్యార్థులకు బుధవారం భోజన ప్లేట్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఎంఈవో అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. అవసరమైన వారికి తోడ్పాటు అందించడం దాతలకు సంతృప్తిని, స్ఫూర్తిని కలిగిస్తుందని తెలిపారు. విద్యార్థులు,ఉపాధ్యాయులు శ్రీనివాసులకు కృతజ్ఞతలు పేర్కొన్నారు.