మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేట నిషేధం

VZM: లీజు సోమ్ము ప్రబుత్వానికి చెల్లించని కారణంగా శుక్రవారం నుండి వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేటను నిషేధిస్తున్నట్లు ఫిషరీస్ సహాయ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వివి ప్రసాద్ తెలిపారు. లీజు సొమ్మును చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణమని వెల్లడించారు. ఈ మేరకు వంగర పోలీస్ స్టేషన్, ఎంపీడీవో, తహసీల్దార్‌లకు అధికారిక లేఖలు సమర్పించినట్లు ఆయన తెలిపారు.