సైదెల్లిపురం గ్రామపంచాయతీ ఏకగ్రీవం.!
KMM: మధిర మండలం సైదల్లిపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బుధవారం నెల్లూరు ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సైదల్లిపురం గ్రామపంచాయతీకి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేసి అందులో ఐదుగురు ఇవాళ విత్ డ్రా చేసుకోవడంతో ధనలక్ష్మి ఒక్కరే ఉండటంతో ఆమె ఏకగ్రీవం అయ్యారు. గ్రామపంచాయతీ ఏకగ్రీవం కావడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ హర్షం చేశారు.