ఈనెల 26 నుంచి మహా శివరాత్రి మహోత్సవాలు

SKLM: జలుమూరు మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖ లింగేశ్వర క్షేత్రంలో వారాహి సమేత శ్రీ ముఖ లింగేశ్వర స్వామి మహా శివరాత్రి మహోత్సవాలు ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని ప్రధానర్చకులు నాయుడు రాజశేఖర్ తెలిపారు. ఆరోజు ఉ.3 గంటలకు జాగరణతో ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం జరుగుతుందన్నారు.తదుపరి 27న పడియ, 28న చక్ర తీర్థ స్నానాలు నిర్వహిస్తామన్నారు.