నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల
SKLM: గుజరాతీపేట విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో 11 కెవీ ఇండస్ట్రియల్ ఫీడర్ పై మరమ్మతులు చేస్తుండడంతో శుక్రవారం కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని విద్యుత్ శాఖ ఈఈ ఎస్ బయన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇండస్ట్రియల్ ఏరియా, పెయ్యలవానిపేట, వరం కాలనీ, నవభారత కూడలి తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.