'మరో పదేళ్లు ఫాంహౌస్‌కు పరిమితం కావాల్సిందే'
HYD: జగిత్యాల సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు దోచుకొని ఇపుడు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారని, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. మీరెంత మొసలి కన్నీరు కార్చినా.. మరో పదేళ్లు ఫాంహౌస్‌కు పరిమితం కావాల్సిందేనని పేర్కొన్నారు.