విజయవంతమైన కరాటే అకాడమీ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు
SRPT: జిల్లా కేంద్రంలోని స్టార్ కిడ్స్ స్కూల్ ప్రాంగణంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు కరాటేలోని కాటా, కూమిటే ప్రాథమిక రక్షణా విధానాలను అద్భుతంగా ప్రదర్శించి పలువురి మన్ననలు పొందారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి వారికి తగిన బెల్ట్ ప్రమోషన్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.