సా.6.30 గంటలకు భారత్ చేరుకోనున్న పుతిన్
భారత్ పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వదేశం నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే పుతిన్ సా.6.30 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నట్లు జాతీయ మీడియాలు కథనాలను ప్రచురించాయి. అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు కేంద్రమంత్రి జైశంకర్ విమానాశ్రయానికి వెళ్లనున్నారు. అనంతరం రా. 7 గంటలకు కళ్యాణ్ మార్గ్‌లో పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు.