VIDEO: చిలకలూరిపేటలో అంగన్వాడీల ఆందోళన
PLD: చిలకలూరిపేటలో అంగన్వాడీలు మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన కోరికలు తీర్చకపోతే గతంలో జగన్‌కు పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందని వారు హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.