ఆలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో విజయ రాజు, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ, జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ పితా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.