ఉదండాపూర్ బాధితులకు న్యాయం జరగాలి: ఎమ్మెల్యే

ఉదండాపూర్ బాధితులకు న్యాయం జరగాలి: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వం రూ.338 కోట్ల ఆర్అండ్ఆర్ ప్యాకేజీని మంజూరు చేసిందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించారు. పెంచిన ప్యాకేజీతో భూ నిర్వాసితులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.