విద్యార్థినికి అండగా నిలిచిన మున్సిపల్ వైస్ ఛైర్మన్
MBNR: మహబూబ్‌నగర్‌లో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బి. భాగ్యలక్ష్మికి మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మారేపల్లి సురేందర్ రెడ్డి అండగా నిలిచారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో ఎమ్మెస్సార్ ఫౌండేషన్ తరపున ఆమె ఫీజులు, హాస్టల్ ఖర్చుల కోసం మొత్తం రూ. 2 లక్షల 10వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.