ఇరాన్ కీలక హెచ్చరికలు జారీ
అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇరాన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పొరుగు దేశాల్లోని అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తామని తెలిపింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థపై విరుచుకుపడతామని స్పష్టం చేసింది. బహ్రెయిన్, కువైట్, యూఏఈలో ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.