కోవా బన్ వివాదంపై స్పందించిన నాగబాబు
NDL: కోవా బన్ అమ్ముకునే వలీని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదని ఆదివారం ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ఈ సంఘటన తర్వాత చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయన్నారు. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని ఆయన స్పష్టం చేశారు.