VIDEO: 'అభ్యర్థులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం'
NLG: చండూరులో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా ఆ పార్టీ చేపట్టిన బంద్ కొనసాగుతోంది. పట్టణంలో దుకాణాలు మూసివేసి వ్యాపారులంతా బంద్‌కు మద్దతు తెలిపారు. రాష్ట్ర నేత గంగిడి మనోహార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.