రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
WGL: గీసుగొండ మండలం మచ్చపూర్ గ్రామం వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి వరంగల్ నుంచి నర్సంపేటకు వస్తున్న మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ రజని భర్త కిషన్ కారును ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవింగ్ చేస్తున్న కిషన్‌తోపాటు పక్కనే ఉన్న మరొకరికి గాయాలయ్యాయి.