మహిళ అదృశ్యం.. కేసు నమోదు
NLR: బుచ్చి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యమైంది. 6వ తేదీ నుంచి మహిళ కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలించినా ఫలితం లేదు. దీంతో మహిళ తండ్రి బుచ్చి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ రెడ్డి తెలిపారు.