ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్‌లో భూకంపం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో ఇరాన్‌లో భూకంపం సంభవించింది. బందర్ అబ్బాస్‌లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.