రైతన్నకు కలిసిరాని 'ఖరీఫ్’
NLG: జిల్లా రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కలిసిరాలేదనే చెప్పాల్సి వస్తుంది. ప్రారంభంలో వరుణుడు ముందుగా మురిపించి ఆశలు రేపినా, ఆ తరువాత పొడిబారిన ఎండలతో మొలకదశలో పంటలు ఎండిపోయాయి. తరువాత వచ్చిన వర్షాలతో కొంత ఉపశమనం లభించగా, ఇటీవలి భారీ వర్షాలు పంటలకు కోలుకోలేని దెబ్బతీశాయి. వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో సాగు చేసిన పంటలు జిల్లావ్యాప్తంగా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.