'నిజమైన 'ప్రేమంటే' అప్పుడే తెలుసుకున్నా'
ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన చిత్రం 'ప్రేమంటే'. నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్యే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసిందని చెప్పాడు. తన బాగోగులు కోరుకుంటూ, చిన్న కామెంట్ రూపంలోనూ తనపై అభిమానం చూపిస్తూ ప్రోత్సహిస్తున్నారని.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.