'హెల్మెట్ ధరించండి-సురక్షితంగా ప్రయాణించండి'
NTR: జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్‌ధారణపై విసృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎనికెపాడు, మహానాడు, రధం సెంటర్, బందర్ రోడ్, బుడమేరు ప్రాంతాల్లో వాహనదారులకు హెల్మెట్ & క్లిప్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. 'హెల్మెట్ ధరించండి-క్లిప్ పెట్టుకోండి-సురక్షితంగా ప్రయాణించండి' అని నినాదాలు చేశారు.