వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల ఆత్మీయ సమావేశం

NLR: వైసీపీకి బూత్ లెవెల్ ఏజెంట్స్ బలం అని వైసీపీ రూరల్ ఇంఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. చింతారెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో బూత్ లెవెల్ ఏజెంట్ (BLA) ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.